ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ కష్టాల్లో పడింది. వరుసగా 4 వికెట్లను కోల్పోయింది. మొదటి మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపని ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఓవర్ నైట్ స్కోరు 21/0 రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 46 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. మరోసారి కేఎల్ రాహుల్(17) నిరాశపరిచాడు. తర్వాత రోహిత్ శర్మ(32), పుజారాల(0)లు ఒకే ఓవర్లో ఔటయ్యారు. 100 టెస్ట్ ఆడుతున్న పుజారా డకౌట్ గా వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ కూడా క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ప్రస్తుతం భారత్ 34 ఓవర్లలో 87 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. విరాట్(14), జడేజా (14) ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నారు. భారత్ కోల్పోయిన 4 వికెట్లు లియాన్ దక్కించకున్నాడు. ఆస్ట్రేలియా కంటే భారత్ ఇంకా 176 పరుగులు వెనుకబడి ఉంది.