బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా బౌలర్లు ఆలౌట్ చేశారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 109 పరుగులకు ఆలౌటైంది. 84/7తో రెండో సెషన్‌ను ప్రారంభించిన భారత్ మరో 25 పరుగులు చేసి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ స్పిన్ ధాటికి భారత బ్యాటర్లు క్రీజులో ఏమాత్రం నిలవలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్‌ల ధాటికి 33.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది టీం ఇండియా. చేసిన 109 పరుగుల్లో కోహ్లీ(22) టాప్ స్కోరర్. గిల్(21), భరత్(17), ఉమేశ్(17), రోహిత్(12) తప్ప తక్కిన వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. చివర్లో అక్షర్ (12) నాటౌట్‌గా ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో కునెమన్ 5, లైయన్ 3, మర్పీ ఒక వికెట్ తీశారు. కాగా, తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది
ఇక, పరుగుల వీరుడు కింగ్ కోహ్లీకి స్వదేశంలో 200వ అంతర్జాతీయ టెస్ట్. తన ప్రత్యేకమైన టెస్టులో విరాట్ నిరాశపర్చాడు. మర్ఫీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్ భారీ స్కోరు చేసి చాలా కాలమైంది. 2020 నుంచి అతడు ఈ ఫార్మాట్‌లో సెంచరీ నమోదు చేయలేదు. 2020లో మూడు టెస్టులు ఆడితే మొత్తం 116 పరుగులు చేశాడు. ఇక 2021లో 11 మ్యాచ్‌ల్లో 536 పరుగులు, గత ఏడాది ఆరు మ్యాచుల్లో 265 పరుగులు చేశాడు.