బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ -ఆస్ట్రేలియా జరుగుతున్న మూడో టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయిన ఆస్ట్రేలియా ప్రస్తుత మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. మొదటి రోజే టీం ఇండియాపై ఆధిపత్యం ప్రదరించారు కంగారులు . భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ చేసి..అనంతరం బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపిస్తోంది.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్లు నష్టపోయి 156 పరుగులు చేసింది. తద్వారా భారత్‌పై 47 పరుగులు అధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో హ్యాండ్స్ కాంబ్(7), కామెరూన్ గ్రీన్(6) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా కోల్పోయిన 4 వికెట్లను జడేజా దక్కించుకోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 60 పరుగులతో రాణించాడు. లబుషేన్ 31, స్టీవ్ స్మిత్ 26 పరులు చేశారు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కున్‌మెన్ 5 వికెట్లు, లియాన్ 3, మర్ఫీ ఒక వికెట్ దక్కించుకున్నాడు.