చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టుంది ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ వ్యవహారం. వయుస్సు పెరుగుతున్నా భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం ఆపట్లేదు. రెండో టెస్ట్‌లో టీం ఇండియా ఘోర పరాజయం పాలవ్వడంతో కిక్కుమని నోరు మెదని ఈ ఆస్ట్రేలియా మాజీలు..మూడో టెస్ట్‌లో ఆధిక్యం ప్రదర్శించేసరికి తమ నోళ్లకు పని చెప్పారు. మూడో టెస్ట్‌లో విఫలమైన భారత ఆటగాళ్లపై విమర్శలకు దిగాడు ఇయాన్ ఛాపెల్. ప్రధానంగా పుజారా, అయ్యర్‌పై అనుచిత మాటలతో దాడి చేశాడు.
మూడో టెస్ట్‌లో భారత్ 109 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఆసీస్ స్పిన్నర్ కున్‌మెన్ ఐదు వికెట్లుతో రాణించాడు. అయ్యర్ 2 పరుగులు చేయగా, అయ్యర్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ ఇన్నింగ్స్ అనంతరం ఇయాన్ ఛాపెల్ స్పందిస్తూ ఆసీస్ ప్రదర్శన ఇలా ఉంటుందని వ్యాఖ్యానించాడు. అంతటి ఆగకుండా భారత్ ఆటగాళ్లపై విషం గక్కాడు. ” కొంతమంది భారత్ ఆటగాళ్ళు నా దృష్టిలో నాణ్యమైన బ్యాటర్లు కాదు. ఆసీస్ బౌలింగ్‌లో త్వరగానే ఔటయ్యారు. పుజారా చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఇక శ్రేయస్ స్పిన్ కు బాగా ఆటతాడు అని విన్నా…కానీ నాకైతే అలా అనిపించలేదు. అతడు చాలా ఆందోళనకు గురయ్యాడు. అతడు కాస్త భయపడే వ్యక్తి” అని ఛాపెల్ విమర్శించాడు.
మూడో టెస్ట్‌లో భారత్ చేతులెత్తేసింది. తొలి రెండు టెస్ట్‌ల్లో అదరగొట్టిన ఆటగాళ్లు ఇండోర్‌లో మాత్రం చతికిలపడ్డారు. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 163 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. పుజారా(59) అర్థసెంచరీతో ఆదుకోవడం భారత్ ఆ మాత్రం పరుగులు చేసింది. ఆస్ట్రేలియాన్ స్పిన్నర్ ఏకంగా 8 వికెట్లు తీసి భారత్ కొంపముంచాడు.