అహ్మదాబాద్‌లో భారత్, ఇండియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు మ్యాచ్ కాసేపటి కిందట ముగిసింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ ముంద ఇండియా బౌలర్లు తడబడ్డారు. ఖవాజా శతకం బాదగా, కామెరాన్ గ్రీన్ ఒక్క పరుగు తక్కువతో అర్ధ శతకం వద్ద ఆగిపోయాడు. ఆట పూర్తయ్యేసరికి ఆసిస్ 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. భారత బౌలర్లు షమీ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేడా చెరో ఒక వికెట్ తీశారు. ఉస్మాన్ ఖవాజా 104 పరుగులు చేశారు. వీటిలో 15 ఫోర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ 32, లబుషేన్ 3, హ్యాండ్స్‌కాంబ్ 17, స్టీవ్ స్మిత్ 38 పరుగులు చేశాడు. ఆసిస్ జట్టు మొదట నెమ్మదిగా ఆడింది. లంచ్ బ్రేక్ సమానికి 29 ఓవర్లలో 75 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లబుషేన్‌కు మూడు పరుగుల వద్దే అడ్డుకట్ట వేశాడు. రెండో సెషన్ ఒక్క వికెట్ కూడా పడకుండానే పూర్తయింది. ఖవాజా భారత బౌలర్లకు వెరవకుండా నెమ్మదిగా సెంచరీ పూర్తి చేశాడు. గ్రీన్ బోల్డ్‌గా 64 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులతో క్రీజులో ఉన్నాడు.