IND vs AUS ODI Series: Glenn Maxwell, Mitchell Marsh return to fold as Aussies announce 16-man squad
mictv telugu

IND vs AUS ODI Series: భారత్‌తో వన్డే సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన..స్టార్ ఆటగాళ్లకు పిలుపు

February 23, 2023

IND vs AUS ODI Series: Glenn Maxwell, Mitchell Marsh return to fold as Aussies announce 16-man squad

భారత్‌తో మార్చి 17 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మొత్తం 16 మంది ప్లేయర్స్‌తో కూడిన లిస్ట్‌ను ఆసీస్ విడుదల చేసింది. గాయం నుంచి జట్టుకు దూరమైన మ్యాక్స్ వెల్, మిచల్ మార్ష్ టీంలో చోటు సంపాదించుకున్నారు. వారితో పాటు జై రిచర్డ్ సన్ కూడా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరో 7 నెలల్లో భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ జరగనున్న నేపథ్యంలో.. ఈ ముగ్గురూ ఆస్ట్రేలియా జట్టుకి కీలకం అవుతారని చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ వెల్లడించాడు. గాయంతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న బౌలర్ హేజిల్‌వుడ్ వన్డే సిరీస్‎కి కూడా దూరమయ్యాడు . రెండో టెస్ట్‎లో గాయపడిన వార్నర్ మాత్రం వన్డే జట్టుకి ఎంపికయ్యాడు. టెస్టులకు సారథ్యం వహిస్తున్న.. పాట్ కమిన్స్‌నే ఆసీస్ బోర్డు వన్డేలకు కూడా కెప్టెన్‎గా నియమించింది.

ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతుంది. మొదటి రెండు టెస్ట్‌ల్లో భారత్ ఘన విజయం సాధించింది. మిగిలిన రెండు టెస్ట్‌లు మార్చి 1-5, మార్చి 9-13 తేదీల్లో జరగనున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ ముగిశాక 17 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది.

భారత్-ఆసీస్ వన్డే సిరీస్ షెడ్యూల్

మొదటి వన్డే -మార్చి 17 (ముంబై)
రెండో వన్డే -మార్చి 19(వైజాగ్)
మూడో వన్డే -మార్చి 22(చెన్నై)

ఆస్ట్రేలియా వన్డే జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జై రిచర్డ్‌సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా