హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో వన్డే సమరానికి సిద్ధమైంది టీమిండియా. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ను ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు బౌలింగ్ చేయనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ బరిలోకి దిగనున్నారు. లంకపై సిరీస్ క్లీన్‌స్వీప్‌తో జోష్‌లో ఉన్న టీమిండియా.. న్యూజిలాండ్ పై పోరుకు సై అంటోంది. మరోవైపు పాక్‌పై విజయంతో జోరు మీదున్న న్యూజిలాండ్ కూడా ఉప్పల్ లో మాదే విజయమని చెబుతోంది. రెండు జట్లు ఈరోజు ఉప్పల్‌లో వన్డే వార్కి రెడీ అయ్యాయి. హోరాహోరీ పోరుతో ఉప్పల్ స్టేడియం ఊగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అభిమానులు సైతం మ్యాచ్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఉప్పల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చని క్రికెట్ కామెంటర్స్ మురళీ కార్తిక్, డానీ మారిసన్ అభిప్రాయపడ్డారు. దీంతో టాస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని పేర్కొన్నారు. ఇరు జట్లకూ బ్యాటింగ్ విషయంలో ఇబ్బందులేమీ ఉండవని తెలిపారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్,శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్,మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్,ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.