IND VS NZ, 2nd T20 Cricket Match Today
mictv telugu

నేడు రెండో టీ20.. కివీస్‌తో తలపడునున్న టీమిండియా

November 20, 2022

కివీస్‌తో మూడు టీ 20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ వర్షార్పణం అయిన నేపథ్యంలో రెండో టీ 20 మీద గంపెడాశలతో భారత్‌ ఎదురు చూస్తుంది. ఆదివారం మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. అయితే మ్యాచ్‌ వేదిక మారిందే తప్ప పరిస్థితుల్లో మార్పులైతే లేవు. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ జోరు కొనసాగిస్తాడనే నమ్మకంతో భారత్‌ ఉంది.

తుది జట్టులో స్థానం కోసం దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌ మధ్య పోటీ ఉంది. ప్రపంచకప్‌లో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయిన వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ పంత్‌ ఎలా రాణిస్తాడో చూడాలి. పొట్టి ఫార్మాట్‌ ఫ్యూచర్ కెప్టెన్‌గా నియమితుడవుతాడని అంతా భావిస్తున్న హార్దిక్‌.. టెంపరరీ కెప్టెన్‌గా ఈ సిరీస్‌లో జట్టును ఎలా నడిపిస్తాడన్నది కూడా ఆసక్తికరం. బౌలింగ్‌లో అందరి కళ్లూ భువనేశ్వర్‌పైనే ఉన్నాయి. ఇటీవలె ముగిసిన టీ 20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భువీ పెద్దగా రాణించలేదు. అయితే అతనికున్న ప్రతిభాపాటవాలను వెలికి తీయడానికి రెండో టీ 20 చక్కటి అవకాశంగా వినియోగించుకోవాలని హర్థిక్‌ పాండ్యా యోచిస్తున్నాడు.

తుది జట్లు (అంచనా)
భారత్‌:
గిల్‌, ఇషాన్‌, శాంసన్‌/శ్రేయా్‌స, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, సుందర్‌, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌/హర్షల్‌, చాహల్‌, అర్ష్‌దీప్‌.

న్యూజిలాండ్‌:
ఆలెన్‌, కాన్వే, విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, సోధీ, మిల్నే, ఫెర్గూసన్‌.

పిచ్‌, వాతావరణం:
ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండనుంది. దీంతో మ్యాచ్‌కు అంతరాయంతో పాటు పూర్తిగా రద్దయ్యే చాన్స్‌ లేకపోలేదు. ఇక్కడ జరిగిన అన్ని టీ20ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లే నెగ్గాయి.