IND VS NZ, 2nd T20 Cricket Match Updates: India begin innings
mictv telugu

బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా.. 5 వ ఓవర్‌లో పంత్ ఔట్

November 20, 2022

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ వర్షార్పణమైన సంగతి తెలిసిందే. మిగిలిన రెండు మ్యాచ్‌లను ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌. ఈ క్రమంలో మౌంట్ మాంగనుయ్‌ వేదికగా రెండో టీ20 మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓటమితో నిరాశ చెందిన ఈ రెండు జట్లూ.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఉపశమనం పొందాలని చూస్తున్నాయి.

టాస్‌ ఓడిన టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. టిమ్‌ సౌథీ బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభించాడు. ఓపెనర్లుగా దిగిన ఇషాన్‌ కిషన్‌, పంత్‌లు మొదట నిలకడగా ఆడినా.. రిషభ్‌ పంత్ (13 బంతుల్లో 6 పరుగులు) తన ఫామ్‌లేమిని కొనసాగిస్తూ పెవిలియన్‌కు చేరాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో (5.1వ ఓవర్‌) షాట్‌ కొట్టేందుకు యత్నించి సౌథీ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ వెంటన్ సూర్యకుమార్ యాదవ్(6) బ్యాటింగ్ కి దిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టంతో 42 పరుగులు చేసింది. పంత్‌(6), కిషన్‌(20) పరుగులతో క్రీజులో ఉన్నారు.

న్యూజిలాండ్‌ జట్టు : విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, కాన్వే, ఫిలిప్స్‌, మిచెల్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ, ఇష్‌ సోథీ, ఆడమ్‌ మిల్నె, ఫెర్గూసన్‌
భారత జట్టు : పాండ్య (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌,దీపక్‌ హుడా, సూర్యకుమార్‌, పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, చాహల్‌