న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3 – 0 తేడాతో గెలుచుకుంది. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో 90 పరుగులతో గెలిచిన భారత్.. ట్రోఫీతో పాటు వన్డేల్లో అగ్రస్థానానికి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్లు రోహిత్, గిల్ సెంచరీలతో 385/9 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో డఫ్పీ, టిక్నర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ 295 పరుగులకు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మొదటి బంతికి అల్లెన్ని హార్ధిక్ పాండ్యా ఔట్ చేసినా మరో ఓపెనర్ కాన్వే వంద బంతుల్లో 138 పరుగులు చేసి ధాటిగా ఆడాడు. ఇతనికి నికోలస్ అండగా నిలబడ్డాడు. కానీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయం ఖాయంగా మారింది. తర్వాత మొదటి వన్డే వీరులు బ్రేస్ వెల్, శాంట్నర్ కాసేపు దడ పుట్టించినా మన బౌలర్లు వికెట్లను పడగొట్టడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ 3, కుల్దీప్ యాదవ్ 3, చాహల్ 2, హార్ధిక్, ఉమ్రాన్ చెరో వికెట్ తీశారు. అటు ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్ విజయంతో భారత్ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి నెం 1 స్థానానికి ఎగబాకింది.