శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్ గెలిచి మాంచి ఊపు మీదున్న టీమిండియా నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. తొలి వన్డే గౌహతిలో జరగనుంది. టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. వీరంతా తిరిగి జట్టులో చేరడంతో బ్యాటింగ్ విషయంలో ఏలాంటి అనుమానం ఉండదని క్లియర్ గా తెలుస్తోంది. కాకపోతే స్పీడ్ స్టార్ బుమ్రా గాయం కారణంగా అతను సిరీస్ నుంచి వైదొలగడం కాస్త ఇబ్బందికరంగా మారింది. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ఆడే ప్రతి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ ఆటతీరు ఎలా ఉంటుందో అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 1:30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మరో 10 నెలల్లో ప్రపంచకప్ ప్రారంభం కానున్న దృష్ట్యా జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ కసరత్తు చేస్తోంది. ఓపెనర్‌గా. రోహిత్‌కు తోడుగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు రోహిత్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. తర్వాత కోహ్లీ.. శ్రేయస్స్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా…. కేఎల్ రాహుల్‌లతో భారత జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. టీ ట్వంటీల్లో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్ యాదవ్… వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు. అటు బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్, సిరాజ్ ఆడే అవకాశం కనిపిస్తోంది. కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుంది.