శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాధించగా.. సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా అజేయంగా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో మొత్తం 46 వన్డే మ్యాచ్‌ల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. కాగా.. వన్డేల్లో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు. జయవర్దనే 418 ఇన్నింగ్స్‌ల్లో 12,650 రన్స్ చేయగా.. కోహ్లీ 267 ఇన్నింగ్స్‌ల్లోనే 12,651 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో వన్డే ఫార్మాట్లో అత్యధిక పరుగుల చేసిన ఐదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. కోహ్లీ.. 87 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 101 (నాటౌట్)పరుగులు చేశాడు.
తొలుత బ్యాటింగ్ కు దిగిన మరో ఓపెనర్ రోహిత్ వర్మ 42 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 95 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆడుతూ సెంచరీ తర్వాత మరో సిక్సర్ బాదాడు. రెండో వికెట్.. గిల్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్ రంగంలోకి దిగి 38( 32 బంతులకు) పరుగులు చేసి లహిరు కుమార బౌలింగ్ లో అవుటయ్యాడు. అతని స్థానంలో కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కు దిగాడు. ఇక ప్రస్తుత టీమిండియా స్కోరు 45 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లకు 336 పరుగులు చేసింది. కోహ్లీ 128, కేఎల్ రాహుల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో కసున్ రజిత 1, లహిరు కుమార 1, చామిక కరుణరత్నే 1 వికెట్ తీశారు.