నేడే రెండో టీ-20...సిరీస్‌పై కోహ్లీసేన కన్ను - MicTv.in - Telugu News
mictv telugu

నేడే రెండో టీ-20…సిరీస్‌పై కోహ్లీసేన కన్ను

December 8, 2019

01233

మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌‌లో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్‌లో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. ఈరోజు సాయంత్రం 7 గంటలకు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా రెండో మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లీ 94 పరుగులు సాధించిన సంగతి తెల్సిందే. ఇప్పటివరకు టీ-20ల్లో 2544 పరుగులు చేసిన కోహ్లీ.. ఇంకో 3 పరుగులు చేస్తే రోహిత్ శర్మపేరుతో ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు.

 

జట్ల వివరాలు..

టీమిండియా:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, శ్రేయాస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్, చాహల్‌, దీపక్‌ చాహర్‌.

వెస్టిండీస్:

పొలార్డ్‌ (కెప్టెన్‌), సిమ్మన్స్‌, లూయిస్‌, హెట్‌మయెర్‌, బ్రాండన్‌ కింగ్‌, పూరన్‌, హోల్డర్‌, పియెర్‌, కాట్రెల్‌, హేడెన్‌ వాల్ష్‌, విలియమ్స్‌.