ind Vs Zimbabwe Team India Set 187 Runs Target To Zimbabwe In T20 World Cup
mictv telugu

చెలరేగిన సూర్యకుమార్.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

November 6, 2022

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 5 వికెట్లు కోల్పోయి జింబాభ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. సూర్యకుమార్(61 (25 బంతుల్లో), నాట్ అవుట్), కేఎల్ రాహుల్(51) ఆఫ్ సెంచరీ చేసి వెంటనే అవుట్ అయ్యాడు. అంతకు ముందు బరిలోకి దిగిన రోహిత్ శర్మ(15), విరాట్ కోహ్లీ(26), రిసబ్ పంత్(3), హార్ధిక్ పాండ్యా(18) పరుగులు చేశారు. మొత్తమ్మీద నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 186 పరుగులు చేసింది.

అంతకుముందు నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేకుండానే టీమిండియా సెమీస్‌కు చేరింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్‌ 2 నుంచి పాకిస్థాన్‌ కూడా సెమీస్‌కు చేరుకుంది.