పంద్రాగస్ట్ మెడల్స్.. ఏపీకి 16, తెలంగాణకు 14 - MicTv.in - Telugu News
mictv telugu

పంద్రాగస్ట్ మెడల్స్.. ఏపీకి 16, తెలంగాణకు 14

August 14, 2020

74వ స్వాతంత్య్ర దినోత్సవం (పంద్రాగస్ట్) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ అవార్డులను ప్రకటించింది. ఏపీకీ 16, తెలంగాణకు 14 పతకాలను అందించనుంది. 215 మందిని గ్యాలంట్రీ పోలీస్ మెడల్ (PMG), 80 మంది రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM) , 631 మందిని విశిష్ట సేవా పోలీస్ పతకాల(PM)కు కేంద్ర హోంశాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, సాయుధ బలగాల వారీగా అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఈ పతకాల్లో ఏపీకి 16, తెలంగాణకు 14 పతకాలు వరించాయి. ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌ను, 14 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు. ఇక తెలంగాణకు చెందిన ఇద్దరు గ్యాలంట్రీ పోలీస్ మెడల్, ఇద్దరు రాష్ట్రపతి పోలీస్ మెడల్, 10 మంది విశిష్ట సేవా పోలీస్ పతకాలను అందుకోనున్నారు.

ఇక ఇతర రాష్ట్రాలవారీగా చూస్తే.. యూపీకి ఎక్కువ అవార్డులు అందనున్నాయి. 102 మంది యూపీకి చెందిన పోలీసులు రేపు అవార్డులు అందుకుంటారు. జమ్మూకాశ్మీర్‌లో 94, మహారాష్ట్రలో 58, ఝార్ఖండ్‌లో 24, తమిళనాడులో 23, పశ్చిమ బెంగాల్‌లో 21, అసోంలో 21, మధ్యప్రదేశ్‌లో 20, కర్నాటకలో 19, గుజరాత్‌లో 19, రాజస్థాన్‌లో 18, పంజాబ్‌లో 15, ఛత్తీస్‌గఢ్‌లో 14, ఒడిశాలో 14, హర్యానాలో 12, మణిపూర్‌లో 7, కేరళాలో 6, త్రిపురలో 6, ఉత్తరాఖండ్‌లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 4, అరుణాచల్ ప్రదేశ్‌లో 4, మిజోరాంలో 3, నాగాలాండ్‌లో 2, సిక్కింలో 2, గోవాలో 1గా అవార్డులు అందుకుంటున్నారు.

తెలంగాణ నుంచి పురస్కారానికి ఎంపికైనవారు

1.నాయిని భుజంగరావు (రాచకొండ ఏసీపీ)

2.మనసాని రవీందర్ రెడ్డి (డీడీ ఏసీబీ హైదరాబాద్)

3.చింతలపాటి యాదగిరి

4.శ్రీనివాస్ కుమార్ (ఏసీపీ సైబరాబాద్)

5.మోతు జయరాజ్ (అడిషనల్ కమాండెంట్, వరంగల్)

6.డబ్బీకార్ ఆనంద్ కుమార్ (డీఎస్పీ ఇంటెలిజన్స్, హైదరాబాద్)

7.బోయిని క్రిష్టయ్య (ఏఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం)

8.కట్టెగొమ్ముల రవీందర్ రెడ్డి (డీఎస్పీ, హైదరాబాద్)

9.ఇరుకుల నాగరాజు (సీఐ, హైదరాబాద్)

10.షేక్ సాధిక్‌ అలీ (మల్కాజ్‌గిరి ఎస్ఐ)