Independence Day 2022: NO holiday on August 15 in UP state, here's why!
mictv telugu

ఆగస్టు 15న సెలవు రద్దు!.. సీఎం కీలక నిర్ణయం

July 17, 2022

 

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యూపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, సంస్థలకు సెలవు రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రకటించారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యాసంస్థల్లో.. అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి అసలు కారణం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు కావడమే. ఆజాది కా అమృత్ మహోత్సవమ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రోజున ఎప్పటిలాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా.. ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే సెలవు రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డీఎస్ మిశ్రా మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా క్లీనింగ్ డ్రైవ్ దీపావళి రోజున నిర్వహిస్తారు. అయితే ఈ సారి దీన్ని జాతీయ కార్యక్రమంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా.. ప్రజలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటుంది యూపీ సర్కార్.