Independence Day 2022: PM Modi says, ‘Corruption eating India like termites, nepotism big challenge'
mictv telugu

దేశాన్ని ఆ రెండు చెదపురుగులు పట్టి పీడుస్తున్నాయి.. ప్రధాని మోదీ

August 15, 2022

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. అవినీతి, వారసత్వం అనే రెండు చెదపురుగులు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈ పీడను తొలగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు. ఈ చెదపురుగులను జనజీవనం నుంచి తరిమేద్దామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అవినీతిపై ఆందోళన వ్యక్తమవుతుందని, అవినీతిపరులపై క్షమ కూడా కనిపిస్తున్నదని వెల్లడించారు. అయితే వారిని క్షమిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనన్నారు. అవినీతి, అవినీతిపరుల విషయంలో జాగృతమవ్వాలని సూచించారు. అవినీతికిపాల్పడేవారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలన్నారు.

వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తారని, ప్రజాస్వామ్యానికి అది విఘాతం కలిగిస్తున్నదని చెప్పారు. వారసత్వం.. కొత్త నాయకత్వానికి అవకాశాలు లేకుండా చేస్తున్నదని, సమర్ధ నాయకులు రాలేకపోతున్నారని వెల్లడించారు. వారసత్వాన్ని ఆదరించడం.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని చెప్పారు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో అందరూ సహకరించాలని కోరారు. మనందరం కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రధాని చెప్పారు