Independent candidates seeking postponement of munugode by-election
mictv telugu

మునుగోడు ఎన్నిక వాయిదా వేయండి.. 35 హింసాత్మక కేంద్రాలున్నాయి

November 2, 2022

తెలంగాణలో రాజకీయంగా కాక రేపిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ గురువారం జరుగనుంది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న 27 మంది రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను బుద్ధభవన్‌లో కలిశారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం లేదని, ఎన్నికను కనీసం 60 రోజులు వాయిదా వేయాలని వినతిపత్రం ఇచ్చారు. భేటీ అనంతరం కందాడి మణిపాల్ రెడ్డి, రఘుమా రెడ్డి, బింగి రాములు మీడియాతో మాట్లాడారు. మద్యం ఏరులై పారుతోందని, ఎన్నిక వాయిదా వేయమని అందరం ఒకే మాటగా చెప్పామన్నారు. ఒకవేళ ఎన్నిక నిర్వహిస్తే మాత్రం ప్రజలందరూ నోటాకే వేయాలని ఓటర్లను కోరారు. అటు పోలింగ్ నేపథ్యంలో సీపీ మహేశ్ భగవత్ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారి ప్రతీ పోలింగ్ కేంద్రంలో కేంద్ర బృందాలతో కలిసి రాష్ట్ర పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 35 హింసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ప్రతీ కేంద్రం సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నాయని వివరించారు.