Independent India’s 1st voter Shyam Saran Negi
mictv telugu

దేశంలో తొలి ఓటరు.. అక్కడ వేశాడు..

November 3, 2022

Independent India’s 1st voter Shyam Saran Negi

ఓటు వేయడం దేశ పౌరుడి యొక్క కర్తవ్యం.అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొందరు ఆసక్తి చూపరు. బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా,లైన్‌లో ఉండి వేసేందుకు బద్దకిస్తూ, ప్రస్తుత రాజకీయాలపై విరక్తి చెంది కొందరు ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఇలాంటి వారందరికీ ఓ 106 ఏళ్ల వృద్ధుడు ఆదర్శంగా నిలిచి..కొత్త ఓటర్లకు స్ఫూర్తిని నింపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

హిమాచల్ అసెంబ్లీకి ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో వృద్ధుల కోసం ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేసింది. దీనికి కిన్నౌర్ జిల్లాకు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగికి రెడ్ కార్పెట్ పరిచి ఆయనకు స్వాగతం పలికింది. వయసులో మాత్రమే కాకుండా నేగికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆయన స్వతంత్ర భారతదేశ మొదటి ఓటరు కావడం విశేషం. అందుకే ఆయన ఓటును నమోదు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. తన తండ్రి 1951లో ఓటు వేసి మొదటి ఓటరు అయ్యారని శ్యామ్ శరణ్ నేగి చిన్న కుమారుడు చందన్ ప్రకాష్ తెలిపారు. ఆయన ఓటు హక్కు వినియోగంచుకోవడం ఇది 34వ సారి కావడం విశేషం.ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విషయానికొస్తే నవంబర్ 12న 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించి డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు.