మిస్ వరల్డ్‌గా భారతీయ భామ - MicTv.in - Telugu News
mictv telugu

మిస్ వరల్డ్‌గా భారతీయ భామ

November 18, 2017

17 ఏళ్లుగా అందకుండా ఊరిస్తున్న ప్రపంచ సుందరి కిరీటం మళ్లీ భారత్ తలపై వచ్చి వాలింది. మిస్ వరల్డ్-2017 టైటిల్‌ను మన అమ్మాయి మానుషి చిల్లార్ కైవశం చేసుకుంది. మిస్ వరల్డ్ కిరీటం అందుకున్న ఆరో భారతీయ వనితగా నిలిచింది.

2000 సంవత్సరంలో ప్రియాంకా చోప్రా ఈ టైటిల్ దక్కించుకుంది. శనివారం చైనాలోని సాన్యా నగరంలో అట్టహాసంగా జరిగిన అందాల పోటీలో మానుషి జ్యూరీని మెప్పించి విజేతగా నిలిచింది.  హరియాణాకు చెందిన 20 ఏళ్ల ఈ భామ.. 29 మంది భారతీయ సుందరులతో పోటీ పడి మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించింది.

గత ఏడాది మిస్ వరల్డ్ గా ఎన్నికై పుయెర్టో రికో సుందరి స్టెఫానీ డెల్ వాలే.. మానుషి తలపై అందాల కిరీటం పెట్టింది. మానుషి సంగీత విద్యార్థిని. మిస్ వరల్డ్ టైటిట్ కొట్టాలని చిన్నప్పటినుంచి ఆశపడుతోంది.