India 2022 roundup story some glimpses some dark spots
mictv telugu

2022 రౌండప్.. దేశంలో ఏం జరిగింది?

December 26, 2022

India 2022 roundup story some glimpses some dark spots

2002.. కరోనా వైరస్ కోరల నుంచి బయటపడిన సంవత్సరం. కొత్తకొత్త ఆశలతో, తడబాట్లతో మొదలైన వార్షిక ప్రయాణం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. జీ5 కూటమి సారథ్యంతో ప్రపంచశక్తిగా అవతరిస్తున్న మనదేశం ఈ ఏడాదిలో కొన్ని విజయాలు సాధించి, పాత చరిత్రలను తిరగరాసింది. వివాదాల్లో చిక్కుకుంది. అయినా ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతోంది. 2022లో దేశంలో నమోదైన కీలక ఘట్టాలపై ఫోకస్ ఇది..

దేశాధినేతగా తొలిసారి గిరిజన మహిళ

దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని మూరుమూల ప్రాంతం నుంచి ఎదిగిన గిరిజన మహిళ చేపట్టారు. ఒడిశాకు చెందిన బీజేపీ మాజీ నాయకురాలు ద్రౌపది ముర్ము ఈ పదవిని అధిష్టించిన తొలి గిరిజన మహిళగా రికార్డుకెక్కారు. జూలైలో జరిగిన ఎన్నికల్లో ఆమె విపక్షాలకు చెందిన తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు.

భారత్ జోడో యాత్ర

బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని, దేశాన్ని మళ్లీ ఏకం చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7న ప్రారంభించారు. కాలినడకన సాగుతున్న ఆయన యాత్రం ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. 3,750 కి.మీ. యాత్ర జమ్మూ కశ్మీర్‌లో ముగుస్తుంది. కుదేలైన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడం ఈ యాత్ర ఉద్దేశం.

తగ్గని బీజేపీ హవా..

మతతత్వ పార్టీ అని ఎన్ని విమర్శలు ఉన్నా బీజేపీ ఈ ఏడాది కీలక ఎన్నికల్లో ఘన విజయాలు సాధించింది. ఈ ఏడాది మొదటల్లో జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికల్లో సత్తా చాటింది. ఇటీవల ముగిసిన గుజరాత్, ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో గెలిచింది. హిమాచల్‌లో మాత్రం పీఠం కోల్పోయింది.

మహారాష్ట్ర సంక్షోభం

మహారాష్ట్రలో తనకు తిరుగులేదనుకున్న శివసేనకు శృంగభంగం జరిగింది ఈ ఏడాదిలోనే. అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే పార్టీని చీల్చి బీజేపీ మద్దతులో ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ ఇలాంటి రాజకీయాలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తోందని చెప్పడానికి ఇది తాజా రుజువు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్థికంలో, టెక్నాలజీలో

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న డిజిల్ రూపీని ఆర్బీఐ ఈ ఏడాదే అమల్లోకి తెచ్చింది. భౌతికమైన కరెన్సీతో పనిలేకుండా లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే సాగనున్నాయి. ప్రయోగాత్మంగా ఈ ప్రాజెక్టు అమలవుతోంది. ఇస్రో తొలిసారి ప్రైవేట్ రాకెట్‌ను ప్రయోగించింది. విక్రమ్ ఎస్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించారు.

సామాజికం

2022లో సుప్రీం కోర్టు మహిళలకు అనుకూలంగా కీలక తీర్పులు వెలువరించింది. 24 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీం ఆమోదం తెలిపింది. అలాగే భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేస్తే అత్యాచారం కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. ఆర్మీలో తాత్కాలిక ఒప్పంద నియామకాల కోసం అగ్నిపథ్ పథకం అమల్లోకి వచ్చింది.

విషాదాలు..

గుజరాత్‌లోని మోర్బీలో 140 ఏళ్ల నాటి వంతెన కూడా 138 మంది చనిపోవడం 2022లోనే కాదు, ఇటీవల కాలంలోనే దేశంలో అతి పెద్ద విషాదం. యూపీలోని బధోయి జిల్లా నార్తువాలో దుర్గాదేవి మంటపం కాలిపోయి 17 మంది చనిపోగా 73 మంది గాయపడ్డారు. వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది, ఢిల్లీ ముంద్కా వాణిజ్య సముదాయంలో జరిగిన ప్రమాదంలో 28 మంది చనిపోయారు. అక్టోబర్ 30న విహారానికి వెళ్లిన జనం వంతెన కూలడంతో జలసమాధి అయ్యారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా హిందూసంఘాల నిరసనలు కూడా కలకలం రేపాయి.

దిగ్గజాల నిష్క్రమణ

2022 ఎందరో ప్రఖులను తీసుకెళ్లిపోయింది. గానకోకిల లతా మంగేష్కర్, సంగీత దర్శకుడు బప్పీ లహరి, సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్, కథక్ నాట్యకళాకారుడు బిర్జూ మహరాజ్ అభిమానులకు శాశ్వతంగా దూరమయ్యారు.

సంక్రాంతి ఫీవర్.. ప్రయాణీకులకు తప్పని తిప్పలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు

ఇకపై చంద్రబాబు కేసీఆర్‌ను ఆడుకుంటారు.. జగ్గారెడ్డి