India all out at 416 in first innings
mictv telugu

భారత్ 416 ఆలౌట్.. చివర్లో బుమ్రా బ్యాటింగ్ సూపర్

July 2, 2022

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు ఆడుతున్న భారత్ మొదట బ్యాటింగ్ చేసి ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. దీంతో క్రీజులోకి వచ్చిన పంత్ శుక్రవారమే సెంచరీ చేయగా, శనివారం జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 84.5 ఓవర్లలో 416 పరుగులు చేసి ఆలౌైటయింది. అయితే 84వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగులో ఇండియా కెప్టెన్ బుమ్రా తన బ్యాటింగుతో అదరగొట్టాడు. ఈ ఓవర్‌లో మొత్తం 35 పరుగులు రాగా, బుమ్రా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు కొట్టి శభాష్ అనిపించుకున్నాడు. రెండో రోజు సెంచరీ వీరుడు జడేజా 104 పరుగుల వద్ద అండర్సన్ బౌలింగులో బౌల్డయ్యాడు.