అమెరికా కంటే భారత్‌ ముందంజ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా కంటే భారత్‌ ముందంజ

October 12, 2019

గత కొన్ని నెలలుగా ఐక్యరాజ్య సమితి సరైన నిధుల్లేక అల్లాడుతోంది. ఆ సంస్థ నిర్వహించే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నెలాఖరుకు రిజర్వ్‌ నిధులు కూడా అయిపోయే ప్రమాదం ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 230 మిలియన్‌ డాలర్ల లోటుతో ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలకు సభ్య దేశాలుగా ఉన్నాయి. సభ్యదేశాలు అందించే వాటా నిధులతోనే ఐక్యరాజ్య సమితి కొనసాగుతుంది. 

కానీ, కేవలం 35దేశాలు మాత్రమే పూర్తి వాటా చెల్లించాయి. ఈ జాబితాను ఐరాసా వెల్లడించింది.ఐకాసకు బకాయి పడ్డ దేశాల్లో వీటో అధికారం కలిగి ఉన్న దేశాలు కూడా ఉండడం గమనార్హం. ఈ విషయంలో భారత్.. అమెరికాను మించి పోయింది. వంద శాతం చెల్లింపుల విషయంలో అగ్రరాజ్యం అమెరికా కంటే భారత్‌ ముందుంది. భారత్ సకాలంలో ఐకాసకు తన వాటా నిధులను చెల్లించింది. కానీ బకాయిలు పూర్తిగా చెల్లించిన దేశాల్లో ఒక్క వీటో దేశం కూడా లేకపోవడం గమనార్హం. బకాయిలు ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్‌ తదితర దేశాలు ఉన్నాయి.