గోడ వెనుక రహస్యం ! - MicTv.in - Telugu News
mictv telugu

గోడ వెనుక రహస్యం !

June 21, 2017

ఇన్ని రోజులూ చైనా గోడే చాలా పెద్దది అనుకున్నాం. ఇక నుండి మధ్య ప్రదేశ్ లోని ఈ వాల్ ను చూసాక తప్పకుండా దీన్ని కూడా గ్రేట్ వాల్ అంటారు. ఈ పురాతన గోడను ఇటీవల మధ్య ప్రదేశ్ పురావస్తు శాఖా వాళ్ళు గుర్తించారు. ఇది భోపాల్ అటవీ ప్రాంతం నుండి జబల్ పూర్ వరకు 80 కిలో మీటర్ల మేర విస్తరించి వుంది. 12వ శతాబ్దంలో నిర్మించి వుంటారని అంచనా వేస్తున్నారు.

ఇది చాలా విశాలంగా, మొత్తం రాతి కట్టడంతోనే వుంది. అడవుల మధ్యలో అక్కడక్కడా శిథిలావస్థ దశలో వున్న దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చటానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తానంటోంది. ఇదెప్పుడు ఏ రాజ వంశస్థులు కట్టారనే కోణంలో పరిశోధనలు జరుపుతున్నారు. అద్భుతమైన శిల్ప సంపద ధ్వంసమైన దాఖలాలు ఎక్కువగా దర్శనమిస్తాయి మనకిక్కడ. అలాగే స్నాన వాటికలు, విశాలమైన గదులు కూడా కనిపిస్తాయి. వాటన్నింటినీ పునరుధ్దరించే పనిలో వుంటామని అంటున్నారు అధికారులు.