India and Aussies will win the second T20 today?
mictv telugu

నేడే భారత్‌, ఆసీస్ రెండో టీ20..ఈరోజైన గెలుస్తారా?

September 23, 2022

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే రెండో టీ20 మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే లేకపోతే టీ20 సిరీస్ ఆస్ట్రేలియాను వరిస్తుంది. అయితే, గత మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోర్ చేసినప్పటికి, బౌలర్ల కారణంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే మ్యాచ్‌లోనైనా భారత్ గెలుస్తుందా? లేదా? అని అభిమానులు వెయ్యి ఆశలతో ఉన్నారు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రోహిత్‌ సేన రెండో పోరుకు రెడీ అయింది. తాజాగా మొహాలీలో జరిగిన పోరులో భారత్..రెండొందలపైగా స్కోరు చేసినప్పటికి దానిని కాపాడుకోలేకపోయింది. సులువైన క్యాచ్‌లను నేలపాలు చేసింది. దాంతో అన్ని వైపుల నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది. ఈరోజు 7 గంటల నుంచి ప్రారంభంకానున్న ఈ రెండో టీ20లోనైనా టీమిండియా జట్టు బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను మంచి ప్రదర్శన కనబరుస్తుందా? లేక కంగారుల చేతిలో మరోసారి ఓటమిపాలవుతుందా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇక, నేటి మ్యాచ్‌లో రోహిత్‌ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌, కార్తీక్‌, అక్షర్‌, హర్షల్‌, భువనేశ్వర్‌, బుమ్రా/ఉమేశ్‌, చాహల్‌/అశ్విన్‌ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియా జట్టు విషయానికొస్తే..ఫించ్‌ (కెప్టెన్‌), గ్రీన్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఇంగ్లిస్‌, డావిడ్‌, వేడ్‌, కమిన్స్‌, ఎలీస్‌, జంపా, హజిల్‌వుడ్‌ ఉండనున్నారు.”టీమిండియా జట్టు సభ్యులంతా పూర్తి ఫిట్‌గా ఉన్నారు. బుమ్రా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తుది నిర్ణయం ఫిజియోదే. పిచ్‌ను అంచనా వేయడం ముఖ్యం. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధంగా ఉంటా. నెట్స్‌లో భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌ చాలా కష్టపడుతున్నారు” అని సూర్యకూమార్ యాదవ్ తెలిపాడు. ఏదిఏమైనప్పటికి ఈరోజు భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే. మరి గెలుస్తారా? లేదా అనేది తెలియాలి అంటే రాత్రి 7 గంటల వరకు వేచి చూడాల్సిందే..