ఈ మధ్య కాలంలో చైనా, ఇండియాల మధ్య వైరం రోజురోజుకు బాగా ముదురుతున్నట్లుంది. ఎవరి ఎత్తులు వాళ్లవి… ఎవరి దోస్తానా వాళ్లది. రెండు మూడు రోజుల నుండి అయితే రెండు దేశాల మధ్య నడుస్తున్న మాటలు చూస్తే యుద్దం తప్పదనే అభిప్రాయం జనాల్లో వస్తున్నట్లుంది. అప్పటి యుద్దం ముచ్చట మర్చిపోయారా అని చైనా అంటే… ఇది అప్పటి ఇండియా కాదని మంత్రి జైట్లీ గట్టి కౌంటర్ ఇచ్చారు. మల్లా అక్కడి దిక్క నుండి ఇది అప్పటి చైనా అస్సలే కాదని అంటున్నరు. ఈ రెండు దేశాల మధ్య నడుస్తున్న ఇష్యూ గురించి చైనా అధికారిక పత్రికలు పెద్ద పెద్ద వ్యాసాలురాస్తున్నవి. రెండు దేశాల మిలిట్రీ సరిహద్దుల్లో నిలిచింది. మన దేశానికి చెందిన అదనపు బలగాలు అక్కడికి చేరుకున్నవనే వార్తలు వస్తున్నవి.
మరిప్పుడు ఇంత ఎత్తున ఎందుకు రెండేశాల మాటల మంటలంటున్నవంటే…..భూటాన్, ఇండియా, చైనాల ఉమ్మడి సరిహద్దులోని కీలక ప్రాంతం డోకాల. ఇది మన దేశానికి ఎంతో కీలకమైనది. దీంట్ల కెంచి చైనా రోడ్డు వేస్తున్నది. ఈ రోడ్డు నిర్మాణాన్ని భూటాన్ వ్యతిరేకిస్తున్నది. ఇది భూటాన్ ఆదీనంలో ఉన్న ప్రాంతం. భూటాన్ కు మన దేశం మద్దతునిస్తున్నది. మీజోక్యం ఎందుకూ అనేది చైనా ఆర్య్యూమెంట్.
మన జోక్యం ఎందుకంటే… ఈ ప్రాంతం రక్షణాత్మకంగా ఇండియాకు చాలా కీలకమైనది. అంతే కాదు ఈశాన్య భారతంతో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నటి కోడి మెడ ప్రాంతం దీన్నే చికెన్ నెక్ అంటరు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే చైనా ఇక్కడికి ఈజీగా చేరుకోగలదు. అందుకే వ్యూహాత్మకంగా భారత్ వ్యవహరిస్తున్నది.
రోడ్డు నిర్మాణాన్ని ఇండియా అడ్డుకోవడంతోచైనా బలగాలు భారత బంకర్లను ధ్వంసం చేశాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్దం మంచిదికాదని… శాంతియుతంగా చర్చించుకోవాలని ఇరు దేశాల నుండి సూచనలు వస్తున్నాయి. ఇటీవల కూడా చైనా, భారత్ ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.