మహిళల టీ20 ప్రపంచ కప్‌లో మరో కీలక పోరుకు టీం ఇండియా సిద్ధమైంది. సాయంత్రం ఐర్లాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన భారత్ రెండో విజయాలు నమోదు చేసింది. చివరిగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై మాత్రం ఓటమి చవిచూసింది.ఉత్కంఠ బరితంగా సాగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. తద్వార పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్‌కు 4 పాయింట్లు ఉన్నాయి. మూడింటికి మూడు గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.
ఐర్లాండ్ పై భారత్ ఓడిపోతే మాత్రం పాక్‌కు సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. భారత్ కంటే నెట్‌రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్నా పాక్..తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తే సెమీస్‌కు పోవచ్చు.అప్పుడు భారత్ ఇంటిముఖం పట్టాల్సిందే. భారత్‌తో సమానంగా 4 పాయింట్లు సాధించిన వెస్టిండీస్ మ్యాచ్‌లు పూర్తికావడంతో కరేబియన్ జట్టు సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయినట్టే.