సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్.. భారీగా భారత బలగాల తరలింపు - MicTv.in - Telugu News
mictv telugu

సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్.. భారీగా భారత బలగాల తరలింపు

August 4, 2020

India Army Depsang to LAC

వాస్తవాదీన రేఖ వెంబడి చొచ్చుకువచ్చిన చైనా తన బలగాలను ఉపసంహరించుకుంటానని చెప్పి మళ్లీ మాట మార్చింది. మరోసారి ఉద్రిక్తతలు పెంచి రెచ్చగొట్టే ప్రయత్నాలకు దిగింది. భారీ ఎత్తున తమ సైనికులను, యుద్ధ విమానాలను మోహరించింది. ఇది గ్రహించిన భారత ఆర్మీ ధీటైన జవాబు ఇచ్చేందుు సిద్ధమైంది. మన సైన్యాన్ని అప్రమత్తం చేసి సరిహద్దు ప్రాంతాలకు15 వేల మంది బలగాలను పంపించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రాగన్ కంట్రీకి గట్టి బుద్ధి చెప్పే విధంగా భారత ఆర్మీ ప్రణాళికను రూపొందిస్తోంది. 

తూర్పు లడఖ్‌లోని దౌలత్ బేగ్ బోల్డీ, దెప్సాంగ్ ప్రాంతాల్లో చైనా దాదాపు 17 వేల మంది సైనికులను, యుద్ధ విమానాలను మోహరించింది. దీన్ని అడ్డుకునేందుకు భారత్ కూడా సిద్ధమైంది.15 వేల మంది జవాన్లు సిద్ధంగా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. కాగా

ఇటీవల భారత భూభాగంలోని పీపీ 7, పీపీ 8 మధ్య చైనా గతంలో నిర్మించిన చిన్నపాటి వంతెనను భారత సైనికులు తాజాగా కూల్చివేశారు. మరోవైపు తమ బలగాలను వెనక్కి తీసుకెళ్తామని చెప్పి అక్కడక్కడే తిరుగుతుండటంతో అధికారులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. చైనా ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని నిశితంగా గమనిస్తున్నారు.