UNHRCలో భారత్ ఉగ్రరూపం...ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణాలకు పాకిస్తాన్ బాధ్యత వహిస్తుంది..!! - MicTv.in - Telugu News
mictv telugu

UNHRCలో భారత్ ఉగ్రరూపం…ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణాలకు పాకిస్తాన్ బాధ్యత వహిస్తుంది..!!

March 4, 2023

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ తన ఉగ్రరూపం చూపించింది. ఉగ్రవాదంపై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణాలకు పాకిస్థాన్ కారణమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు పాకిస్థాన్‌లో ఏ మతపరమైన మైనారిటీ కూడా స్వేచ్ఛగా జీవించలేరని లేదా తమ మతాన్ని ఆచరించలేరని UNHRCలో భారత ప్రతినిధి సీమా పూజాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పౌరుల మరణాలకు పాకిస్థాన్ విధానాలు ప్రత్యక్షంగా కారణమవుతున్నాయి అని అన్నారు. మతపరమైన మైనారిటీలు, ఉగ్రవాద సమస్యలపై భారతదేశం పాకిస్తాన్‌ను ఏలెత్తి చూపడంతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉందన్నారు.

పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ, “భారత హిందూత్వ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కాశ్మీరీ ప్రజల జీవితాలను అమానవీయంగా మార్చింది. కాశ్మీరీలు వారి హక్కుల కోసం మాట్లాడితే, వారిని ఉగ్రవాదులుగా నిందించాలి” అని వ్యాఖ్యానించారు. దీంతో భారత ప్రతినిధి సీమా పూజ ఫైర్ అయ్యారు. “భారత్‌పై తన దురుద్దేశపూరిత ప్రచారానికి పాక్ ప్రతినిధి మరోసారి ప్రతిష్టాత్మక వేదికను దుర్వినియోగం చేయడానికి ఎంచుకున్నారు” ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ లోనే పరిస్ధితులు సరిగ్గా లేవు…పక్క దేశం గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటూ నిప్పులు చెరిగారు. పాక్ లో మతపరమైన మైనారిటీలు హింసకు గురవుతున్నారు. వారిని బలవంతంగా అదృశ్యం చేసి బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారు ఆగ్రహించారు.

పాకిస్థాన్ విచారణ కమిషన్ నివేదికలోనే ఇటీవల 8463 మంది అదృశ్యమైనట్లు అంగీకరించినట్లు పూజానీ తెలిపారు. వారిని మతమార్పిడి చేసి ఇస్లాంలోకి మార్చేందుకు పాకిస్థానీయులు బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనలు రోజూ జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం మౌనంగా ఎందుకు ఉంటుందన ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రభుత్వ క్రూర విధానానికి బలూచిస్థానీయులు కూడా శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మతపరమైన మైనారిటీలు తరచుగా క్రూరమైన దైవదూషణ చట్టాల ద్వారా లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. వారి మతస్వేచ్ఛతో జీవించే హక్కు వారికి లేదు. ఇలా చేయడం వల్ల మతపరమైన మైనారిటీల టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా కనుమరుగు అవుతున్నారు. హిందూ బాలికలను తరచుగా అపహరించి ఇస్లాం స్వీకరించేలా చేస్తారు. మతపరమైన ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అంతా మౌనంగా ఉంది. భారత్ నుంచి బలమైన సమాధానం రావడంతో UNHRC లో పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయింది.