రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఆర్మీ క్యాంటీన్లలో అవి బంద్  - MicTv.in - Telugu News
mictv telugu

రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఆర్మీ క్యాంటీన్లలో అవి బంద్ 

October 24, 2020

india

భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిలటరీ క్యాంటీన్లలో విదేశీ వస్తువులు విక్రయించరాదని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే మద్యం,ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేదం ప్రకటించారు. స్వదేశీ బ్రాండ్ల విక్రయాలను పెంచాలనే ఉద్దేశ్యంతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమావేశంలో ఈ ప్రతిపాధన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 4 వేల మిలటరీ క్యాంటీన్లలో విదేశీ బ్రాండ్లు ఇక నుంచి కనబడవని పేర్కొన్నారు. 

క్యాంటీన్‌లోకి కావాల్సిన విదేశీ  వస్తువులను దిగుమతి చేసుకోరాదని రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మిలటరీ క్యాంటీన్లలో ప్రస్తుతం సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు విదేశీ మద్యంతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను విక్రయిస్తున్నారు. ఇటీవల భారత్ చైనా మధ్య వివాదం నెలకొనడంతో ఆ దేశ వస్తువులపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు రకాల వస్తువులను నిలిపివేసింది. తాజాగా ఆర్మీ క్యాంటీన్లలో పూర్తిగా అన్ని వస్తువుల అమ్మకాలు నిషేదం విధించడం విశేషం.