India Bans Sale Of Single Use Plastic Items From July 1
mictv telugu

జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ బ్యాన్

June 28, 2022

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై జులై 1నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం అమ‌లుకానుంది. ఈ ఉత్పత్తులకు గుడ్ బై పలికేందుకు ప్ర‌భుత్వం త‌గినంత స‌మ‌యం ఇచ్చింద‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్ అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని గతంలోనూ పలుమార్లు హెచ్చరించామని, ఇందుకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ సమయమే ఇచ్చామని ఆయన తెలిపారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగంపై జులై 1 తేదీపై నిషేధం అమల్లోకి వస్తుంది. పాలీస్టైరిన్, పాలీస్టైరిన్ సంబంధిత వస్తువులపై నిషేధం ఉంది.

నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు ఉత్పత్తుల జాబితాలో.. బెలూన్ల ప్లాస్టిక్ స్టిక్‌లు, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, క్యాండీ స్టిక్స్, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ గ్లాసులు ప్రధానమైనవి. వీటితో పాటు 100 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ స్పూన్ లు, పోర్కులు ఇకపై కనిపించవు. అలాగే, స్వీట్ బాక్స్‌లు, సిగరెట్ ప్యాకెట్లు, ఇన్విటేషన్ కార్డులపై అలంకరణ కోసం వాడే వ్రాపింగ్ ప్లాస్టిక్ ఫిల్మ్‌లు కూడా నిషేధిత జాబితాలో చేర్చ‌డం గ‌మ‌నార్హం.