ఆస్ట్రేలియాపై రెండో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. సిరీస్‌లో వరుసుగా రెండో సారి మూడో రోజుల విజయాన్ని అందుకుంది . నాలుగు టెస్టుల- బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్ నిర్దేశించిన 115 పరుగల లక్ష్యాన్ని టీమిండియా 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ 31, పుజారా 31*, శ్రీకర్ భరత్ 23* కోహ్లీ 20 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్ రెండు, ముర్ఫీ ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకుమందు రెండో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. జడేజా 7, అశ్విన్ 3 వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా భారత్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో జడేజా 110 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.
115 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురదెబ్బ తగిలింది. మరోసారి కేఎల్ రాహల్ విఫలమయ్యాడు. రెండో ఓవర్ లోనే జట్టు స్కోర్ 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. రాహుల్ ఔటయ్యాక దూకుడుగా ఆడిన రోహిత్ రెండో రన్ కోసం ప్రయత్నించి వద్ద రనౌట్ అయ్యాడు. తర్వాత కోహ్లీ, అయ్యర్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరినా శ్రీకర్ భరత్‌తో కలసి పుజారా భారత్‌కు విజయాన్ని అందించాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి మొదటి రోజే కుప్పకూలింది. ఖవాజా 81, హ్యాండ్స్‌కాంబ్ 72 పరుగులతో రాణించారు. భారత్ బౌలర్లలో షమీ 4, అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు తీసుకున్నారు. తర్వాత మొదటి మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ 262 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 139 పరుగులకే 7 వికెట్లు పడి కష్టాల్లో ఉన్న భారత్‌ను అక్షర్ పటేల్, అశ్విన్ జోడి ఆదుకుంది. అక్షర్ పటేల్ 74 పరుగులతో చెలరేగితే..అశ్విని 37 పరుగులు చేసి అతడికి సాయం అందించాడు. విరాట్ కోహ్లీ 44, రోహిత్ శర్మ 32 పరుగులు చేశారు. ఆస్ట్రేలియ బౌలరల్లో లియాన్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు.