India beat Bangladesh in t20 world cup in australia
mictv telugu

నరాలు తెగే ఉత్కంఠ.. 5 పరుగుల తేడాతో బంగ్లాపై భారత్ విజయం

November 2, 2022

బుధవారం జరిగిన భారత్ – బంగ్లా మ్యాచులో ఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లీ, రాహుల్, సూర్య కుమార్ యాదవ్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా ధాటిగా ఆడింది. ఓపెనర్ లిట్టన్ దాస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లో 60 పరుగులు చేసి మంచి శుభారంబాన్ని ఇచ్చాడు. మధ్యలో వర్షం పడడంతో కాసేపు ఆటకు అంతరాయం కలుగగా, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచుని కుదించి మళ్లీ ప్రారంభించారు. 16 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్‌ను బంగ్లాకు నిర్దేశించారు. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ధాటిగా ఆడుతున్న లిట్టన్ దాస్‌ను కేఎల్ రాహుల్ మెరుపు వేగంతో రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపింది. తర్వాత బౌలింగ్ చేసిన అర్ష్ దీప్ సింగ్ తన పదునైన బంతులతో ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ ఆధీనంలోకి వచ్చింది. తర్వాత బంగ్లా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినా చివరి వరకు తీవ్రంగా పోరాడి గెలిచినంత పని చేశారు. చివరికి నిర్ణీత 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేసి ఓటమి చవి చూసింది. 5 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.