ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కివీస్ జట్టు 337 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 12 పరుగుల కొద్ది తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన మ్యాచులో కివీస్ బ్యాట్స్మెన్ బ్రేస్ వెల్ మెరుపు సెంచరీతో వణుకు పుట్టించాడు. 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కేవలం 78 బంతుల్లో 140 పరుగులు చేసి గెలిపించినంత పని చేశాడు. కానీ చివరి ఓవర్లో శార్దూల్ బౌలింగులో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో కేవలం బంతుల తేడాతో గెలిచి టీమిండియా ఊపిరి పీల్చుకుంది. సిరాజ్ 4, శార్దూల్ 2, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ గిల్ డబుల్ సెంచరీతో 349 పరుగులు చేసింది.