వజ్రాల్లో రెండు రకాలు ఉంటాయి. సహజ సిద్ధంగా భూమి లోపల నుంచి తయారు చేసేవి, ల్యాబొరెటరీల్లో తయారు చేసేవి మరికొన్ని. భూమిలో దొరికే వాటి కోసం చాలా కష్టపడాలి. చాలా లోతుకు తవ్వాలి. దీనికి ఎంత సమయం పడుతుంది అన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ కృత్రిమ వజ్రాల తయారీ మన చేతుల్లోనే ఉంటుంది. వీక్స్ లోనే తయారయిపోతాయి. నిజానికి అసలు దానికి, తయారు చేసిన దానికి పెద్ద తేడా ఉండదు. నాణ్యత కూడా ఇంచుమించు ఒకలాగే ఉంటుంది కూడా. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని అంటుటంటారు. అంత గట్టిగా ఉంటాయని అర్ధం. తయారు చేసేవి కూడా అంతే గట్టిగా ఉంటాయి.
అసలు వజ్రానికి ఉన్న డిమాండ్ కృత్రిమంగా తయారు చేసేవాటికి ఉంటుందా అంటే….. ఉండదనే చెప్పాలి. అయితే అసలువి చాలా ఖరీదు ఉంటాయి. అదే తయారు చేసిన వాటికి అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కరలేదు. వజ్రాలు కొనుక్కోవాలని ఎవరికి ఉండదు కానీ డబ్బులకు జడిసి కొనుక్కోరు. అలాంటి మధ్య తరగతి వాళ్ళకు కృత్రిమ వజ్రాలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పడు కేంద్ర బడ్జెట్లో కృత్రిమ వజ్రాల తయారీకి భారీ ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది కేంద్రం. దీంతో వీటి తయారీ మరింత ఊపందుకోవచ్చును. అలాగే దరలు కూడా మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
మనదేశంలో వజ్రాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా జరుగుతాయి. వజ్రాల కోత, మెరుగు లాంటి పరిశ్రమలు మనకే ఎక్కువ ఉన్నాయి. గుజరాత్లో వజ్రాల పనివాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉన్నారు. ప్రపంచంలోని డైమండ్ ఎగుమతుల్లో భారత్ వాటా 19శాతం ఉండగా, దిగుమతిలో కూడా మనం ముందే ఉన్నాం. ఇక కృత్రిమ వజ్రాల తయారీలో చైనా ముందుంది. ఇప్పడు దానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా మనం కూడా ఇందులో మరింత ముందుకు వెళ్ళోచ్చని కేంద్రం భావిప్తోంది.అయితే దీని మీద వజ్రాల వ్యాపారులు అంత సుముఖంగా లేరు. కృత్రిమ వజ్రాల తయారీ ఎక్కువైతే అసలు వజ్రాలకు డిమాండ్ తగ్గిపోతుందని వాళ్ళ అభయం. అందుకే అసలు వజ్రాలకు కూడా ప్రోత్పాహకాలు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.