స్టాక్ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడి చేయించింది భారతే.. ఇమ్రాన్  - MicTv.in - Telugu News
mictv telugu

స్టాక్ ఎక్స్ఛేంజిపై ఉగ్రదాడి చేయించింది భారతే.. ఇమ్రాన్ 

June 30, 2020

prime minister

ఉగ్రవాదులను పెంచి పోషించే పాకిస్తాన్ మళ్లీ నంగనాచి కబుర్లు వెల్లెవేసింది. కరాచీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజిపై జరిగిన ఉగ్రదాడి వెనుక భారత్ హస్తముందని ఆరోపించింది. ‘దాడి వెనుక భారత్ హస్తం కాదలేని సత్యం. దాడి జరుగుతుందని మా కేబినెట్ మంత్రులు రెండు నెలలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం.  మా నిఘా సంస్థలను అలర్ట్ చేశాం’ అని ఆయన పార్లమెంటులో చెప్పారు. తామే దాడి చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం తెలిసిందే. బలూచ్ ప్రాంతంలో పాక్ సైన్యం పాశవిక నిర్బంధానికి, హత్యలకు పాల్పడుతోందని బలూచ్ వేర్పాటువాదులు ఆరోపిస్తున్నారు. 

కాగా, భారత ప్రభుత్వం 25వేల మంది కాశ్మీరీ ప్రజలకు స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలను అందజేయడంపై ఇమ్రాన్ ఖాన్ అక్కసు వెళ్లగక్కారు. ‘జమ్మూ కశ్మీర్‌ తమదిగా చెప్పుకోడానికి డొమిసైల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అది మా భూభాగం. దానిపై భారత్‌కు హక్కులేదు. ఈ సర్టిఫికెట్లు ఐరాస భద్రతామండలి తీర్మానాలకు, జెనీవా ఒప్పందానికి విరుద్ధం.. ’ అని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై ఐరాసకు ఫిర్యాదు చేస్తామని, కశ్మీల హక్కులను కాపాడతామని అన్నారు.