భారత్ బెస్ట్ - పాక్ వేస్ట్: తాలిబన్లు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ బెస్ట్ – పాక్ వేస్ట్: తాలిబన్లు

March 5, 2022

‘భారతదేశం బెస్ట్ – పాకిస్తాన్ దేశం వేస్ట్’ అంటూ అఫ్గనిస్తాన్‌ తాలిబన్లు భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గోధుమల విషయంలో పాకిస్తాన్ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌‌పై తాలిబన్ల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ”పాక్‌ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి. బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో” అంటూ మండిపడ్డారు.

మరోవైపు ”భారత్‌ మేలిమి రకపు గోధుమలను అందించింది. అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అంటూ తాలిబన్‌ ప్రతినిధులు పాక్‌-భారత్‌ గోధుమ సాయంపై స్పందించిన వీడియోను అఫ్గన్‌‌కు చెందిన జర్నలిస్ట్‌ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్‌ చేశారు. దీంతో అటు అఫ్గన్‌ నెటిజనులు సానుకూల స్పందిస్తున్నారు. జై హింద్‌ అంటూ పలువురు అఫ్గన్‌ పౌరులు కామెంట్స్ చేస్తున్నారు.

 

మరోపక్క సంక్షోభ సమయం నుంచే భారత్‌, అఫ్గనిస్థాన్‌కు సాయం అందిస్తోంది. ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడిన విషయం తెలిసిందే. అమృత్‌సర్‌ నుంచి గురువారం 2వేల మెట్రిక్‌ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్‌తో భారత్‌ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్వీట్‌ చేశారు.