పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) విషయంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పీవోకే భారత అంతర్భాగమని తేల్చిచెప్పే విధంగా మరో ముందడుగు వేసింది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇకపై పీవోకే ప్రాంతాల్లోనూ వాతావరణ సూచనలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం పాక్ ఆధీనంలో ఉన్న గిల్గిట్-బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌లో వాతావరణ మార్పులకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేయనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.