ఆర్థిక సంవత్సర మార్పు మంచికేనా... - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్థిక సంవత్సర మార్పు మంచికేనా…

July 22, 2017

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన ర్వాత….. ఇంకా చెప్పాలంటే కూడా మోడీ ప్రధాని అయిన తర్వాత పాత పద్దతులకు పాతరేస్తున్నారు.  కొత్తవి తెచ్చి పెడుతున్నారు. పద్దతులు పాతవైనా… కొత్తవైనా  పద్దతులు పద్దతులే కదా. అయితే  రెండేళ్ల నుండి ఏదో ఒక దాన్ని మారుస్తూ వస్తున్నారు. తాజాగా  ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదట.  దీనికి సంబంధించి నిపుణులతో చర్చలు, సంప్రదింపులు కూడా పూర్తి చేసిందట. కొద్ది రోజుల్లో దీనిపై క్లారీటీ ఇవ్వడానికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ రెఢీ  అవుతున్నారట. ఈ రోజు మీడియా మీట్ లో ఆర్థిక సంవత్సర మార్పు గురించి చెప్పారు జైట్లీ.

 ఇంతకు ముందు ఆర్థిక సంవత్సరం మార్చి టు ఏప్రిల్ మధ్య ఉంది. బడ్జెట్లు కూడా ఇట్లాగే పెడుతున్నారు.  ఇందులో కొత్తగా చేసే మార్పు…. జనవరి నుండి డిసెంబర్ కు మారుస్తున్నారట. అంటే బడ్జెట్ ఇక  నుండి ఫిబ్రవరిలో కాకుండా డిసెంబర్ లోనో…. నవంబర్ లోనో  పెట్టే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతున్నది.

ఇంతకు ముందు  పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం  కొత్త నోట్లు తీసుకొచ్చింది. నగదు లావాదేవీల స్థానంలో డిజీటల్ లావాదేవీలు చేసేందుకు కసరత్తులు  చేస్తున్నది. దేశం అంతా 500 రకాలకు పైగా ఉన్న పన్నుల వ్యవస్థను జీఎస్టీ పేరుతో ఒక దేశం ఒక పన్ను, ఒక మార్కెట్ గా  చేసింది.  దాని కంటే ముందు ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ను పెట్టింది. దీని ద్వారా డెవలప్మెంట్ యాక్టీవిటీ  చేస్తున్నది.

రైల్వే బడ్జెట్, జనరల్ బడ్జెట్ వేర్వురుగా ఉండేవి.  మోడీ వచ్చిన తర్వాత ఈ రెండు కలిపి ఒకే బడ్జెట్ గా చేశారు. తాజాగా తీసుకోబోతున్న  నిర్ణయం ఆర్థిక సంవత్సరం మార్పు చేయడం. ఇదే కాదు మరో   పెద్ద నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందనే ఊహాగానాలు  వస్తున్నాయి. అదే టైమ్ కు సంబంధించింది. దేశం అంతా ఒకే  టైమ్ జోన్ చేయాలని భావిస్తున్నదట. నార్త్ ఈస్ట్  రాష్ట్రాలకు, మనకు సమయంలో కొంత తేడా ఉంది. దాన్ని సరి చేసి ఒకే టైమ్ పెడ్తారట. అప్పుడు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే వేళల్లో మార్పు వస్తుంది. టైమ్ జోన్ విషయం ఖచ్చితంగా మంచి నిర్ణయం అంటున్నారు కొందరు. అయితే  ప్రభుత్వం ఏదో ఒకదాని విషయంలో మార్పులు చేస్తూనే ఉన్నది. మార్పు మంచికేనా.. అంటే  ఏమో చెప్పలేం. ఇప్పటికైతే  మార్పుల వల్ల వచ్చిన ప్రయోజనం డైరెక్ట్ గా ఏమీ కన్పించడం లేదు. ముందు ముందు చెప్పలేం.