India: Corona update..how many new cases?
mictv telugu

భారత్: కరోనా అప్‌డేట్..కొత్తగా 13,615 కేసులు..

July 12, 2022

భారతదేశంలో ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 13,615 కొవిడ్‌ కేసులు నమోదయ్యాని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాసేపటిక్రితమే కరోనా కొత్త కేసులకు సంబంధించిన బులెటెన్ విడుదల చేసింది.

విడుదల చేసిన బులెటెన్‌లో ”తాజాగా 13,615 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. మరో 13,265 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, గడిచిన 24 గంటల్లో మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,043కి చేరుకున్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,36,52,944కు చేరుకుంది. వీరిలో 4,29,96,427 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,474 మంది ప్రాణాలు కోల్పోయారు”

ఇక, దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు విషయానికొస్తే.. 3.23శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.30 శాతంగా, రికవరీ రేటు 98.50 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 1,99,00,59,536 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 10,64,038 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్లు అధికారులు తెలిపారు.