చరిత్ర సృష్టించిన టీమిండియా... - MicTv.in - Telugu News
mictv telugu

చరిత్ర సృష్టించిన టీమిండియా…

August 14, 2017

శ్రీలంకతో జరిగిన మూడో టెస్ట్ ఇన్నింగ్స్ లో 171 పరుగుల తేడాతో శ్రీలంక పై భారత్ విజయం సాధించింది. విదేశి గడ్డ పై మూడు టెస్ట్ ల సిరీస్ ను ఇండియన్ టీమ్ క్లీన్ స్వీప్ చేయడం ఇదే మెుదటి సారి. తొలి రెండు టెస్ట్ లను నాలుగు రోజుల్లో ముగించిన టీమిండియా. మూడో టెస్ట్ ను మాత్రం మూడు రోజుల్లో ముగించేసింది.

తొలి ఇన్నింగ్స్ లో 135 రన్స్ కు ఆలౌటైన శ్రీలంక . రెండో ఇన్నింగ్స్ లో 181 రన్స్ మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ లో ఆశ్విన్ 4, షమి3, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. శ్రీలంక నుంచి డిక్ వెల్లా 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో భారత్ 487 పరుగులు చేసింది. లంకను తొలి ఇన్నింగ్స్ లో 135 రన్స్ కే ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ధావన్ 119, పాండ్యా 108 పరుగులు చేశారు.