India extends grace period for sugar exports to July 20
mictv telugu

చక్కెర ఇక చేదు! మిల్లర్ల డిమాండుకు కేంద్రం ఓకే

July 8, 2022

India extends grace period for sugar exports to July 20

దేశంలోని చక్కెర మిల్లర్లకు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. గతంలో 8 లక్షల టన్నుల చక్కెర ఎగుమతుల కోసం మిల్లర్లకు ఇచ్చిన గడువును మరో రెండు వారాల పొడిగించింది. జులై 20వ తేదీ వరకు ఎగుమతులకు అనుమతివ్వనున్నట్లు శుక్రవారం కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం దేశంలో విస్తారంగా వానలు కురుస్తుండడంతో.. ఫ్యాక్టరీల నుండి ఓడరేవులకు చక్కెర నిల్వలను తరలించడం కష్టతరంగా మారింది. దీంతో ఎగుమతి గడువును పొడిగిస్తూ మిల్లర్లకు కేంద్రం ఊరట కలిగింది. కేంద్రం తాజా నిర్ణయంతో జులై 5వ తేదీతోనే ముగియాల్సిన గడువు.. జులై 20 వరకూ కొనసాగనుంది.

అయితే దీనివల్ల దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలకు రెక్కలొచ్చే అవకాశముందని కొందరు మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే షుగర్ మిల్లర్లు మాత్రం ఎగుమతుల కారణంగా దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు పెరిగే అవకాశం లేదని , ప్రస్తుత అవసరాలకు తగిన నిల్వలు మన దగ్గర ఉన్నాయని అంటున్నారు. చక్కెర ఎగుమతులకు వచ్చిన గడువును పొడగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) హర్షం వ్యక్తంచేసింది. కేంద్ర నిర్ణయం పట్ల ఇస్మా ప్రెసిడెంట్ ఆదిత్య జున్‌జున్‌వాలా ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమంటూ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.