భారతదేశం భయపడుతుంది: బైడెన్ - MicTv.in - Telugu News
mictv telugu

భారతదేశం భయపడుతుంది: బైడెన్

March 22, 2022

 

modi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎందుకో భయపడుతుందని అన్నారు. మంగళవారం అమెరికన్‌ సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.  సమావేశానికి బైడెన్‌ హాజరైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..”రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ ఎందుకో జంకుతోంది. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోంది. రష్యాపై భారత్‌ కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయడంలో కొంతవరకు వణుకుతోంది. అమెరికా మిత్రదేశాలన్నీ ఐక్యంగా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా ఉంది” అని బైడెన్ అన్నారు.

మరోపక్క ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశం విరామం లేకుండా యుద్దాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రష్యా దాడితో ఉక్రెయిన్‌ అల్లకల్లోలంగా మారుతోంది. కోట్ల సంపద సర్వ నాశనం అవుతోంది. సైనికులు, అమాయక పౌరులు యుద్ధ భూమిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఉక్రెయిన్‌కు సాయం అందిస్తూనే, మరోవైపు రష్యాపై నిషేధం విధిస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్షుడు బైడెన్ భారత్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.