india first oter shyam saran negi died
mictv telugu

దేశ తొలి ఓటరు ఇక లేరు..

November 5, 2022

దేశంలో తొలి ఓటరు ప్రస్థానం ముగిసింది. దేశంలో మొట్టమొదటి ఓటు వేసిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి శుక్రవారం కన్నుమూశారు.1951 అక్టోబర్ 25న మొదటి ఓటు వేసిన శరణ్.. నవంబర్ 2న తన ఇంటి నుండి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి చివరి ఓటు వేశారు. మొత్తం అతని జీవితంలో 34 సార్లు ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు.తాను చనిపోయే ముందు కూడా శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.చివరి ఓటు వేసిన అనంతరం అందరం మన ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని శ్యామ్ సూచించారు. కాగా శ్యామ్ శరణ్ నేగి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.

1917లో హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించిన శ్యామ్ శరణ్ నేగి.. తాను చూసిన బ్రిటిష్ పాలన గురించి అనేక సార్లు కథలు కథలుగా చెప్పేవారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించి ..1952లో తొలిసారి ఓటింగ్‌ నిర్వహణ గురించి కూడా శ్యామ్ అనేక విషయాలను నేటి సమాజానికి వివరించేవారు.