అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అంతరిక్షం. అక్కడ ఏం జరిగినా మెస్మరైజింగ్ గానే ఉంటుంది. అది మనం గుర్తించగలిగితే, చూడగలిగితే ఇంకా భలే ఉంటుంది. ఇప్పుడు స్పేస్ లో అలాంటిదే జరుగుతోంది. ఒక చనిపోతున్న నక్షత్రాన్ని కృష్ణబిలం తనలోకి లాగేసుకుంటోంది. అది కూడా చాలా వేగంగా జరుగుతోందట. దానివలన అంతరిక్షంలో పెద్ద యుద్దమే జరుగుతోంది. దాని నుంచి వచ్చిన కాంతి పుంజాలు వెలువడుతున్నాయి. అవి చాలా దూరం వరకు కనిపించి….కళ్ళకు విందు చేస్తున్నాయిట.
ఈ అరుదైన వింతను మన దేశంలోని టెలిస్కోప్ లు గుర్తించాయి. ఉత్తరాఖండ్ లోని సరస్వతి మౌంటెన్స్ పై ఉన్న గ్రోత్ టెలిస్కోప్ దీనిని గుర్తించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్, ఐఐటీ బాంబే కలిసి అభివృద్ధి చేసిన తొలి పూర్తి స్థాయి రోబోటిక్ ఆప్టికల్ రీసెర్చ్ టెలిస్కోప్ ఇది.
నక్షత్రాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. కాకపోతే కొన్ని వేల, లక్షల సంవత్సరాల కాలం మాత్రం బతికి ఉంటాయి. ప్రస్తుతం చనిపోతున్న నక్షత్రానికి పేరు లేదు కానీ అది మాత్రం అంత్యదశలో ఉందని శాస్త్రజ్ఞులు గుర్తించారు. దాన్ని భారీ కృష్ణబిలం తన అనంతమైన ఆకర్షణ శక్తితో తనలోకి లాగేసుకుంటోంది. దాంతో నక్షత్రం కృష్ణబిలం ఊహాతీత వేగంతో దానివైపు వెళుతోంది. వీటిని టైడల్ డిస్రప్షన్ ఈవెంట్స్ అంటారని ఐఐటీ బాంబే ఆస్ట్రో పిజిసిస్ట్ వరుణ్ భలేరావ్ తెలిపారు. అంతరిక్షంలో జరుగుతున్న ఈ అద్బుతం మనకు 850 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. జర్నల్ నేచర్ అనే జర్నల్ లో ఈ విషయాన్ని పబ్లిష్ చేశారు.