మొగోళ్లకు తొలిసారిగా ఆ ఇంజెక్షన్.. భారత శాస్త్రవేత్తల ఘనత  - MicTv.in - Telugu News
mictv telugu

మొగోళ్లకు తొలిసారిగా ఆ ఇంజెక్షన్.. భారత శాస్త్రవేత్తల ఘనత 

December 7, 2019

India Has Developed World's First Male Contraceptive Injection 

సంతాన నిరోధం కోసం ఆడవారికి చాలా మార్గాలు ఉన్నాయి. పిల్స్, సర్జరీ, ఫీమేల్ కండోమ్స్, జెల్స్.. మరెన్నో అందుబాటులో ఉన్నాయి. మగవారికి ప్రస్తుతం వేసక్టమీ, కండోమ్స్, అభివృద్ధి దశలో ఉన్న జెల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లోటును భర్తీ చేస్తూ భారత వైద్యశాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా సంతాన నిరోధక ఇంజెక్షన్లను అభివృద్ధి చేశారు. ఆపరేషన్ అవసరం లేకుండా కేవలం ఒక సూదిపోటుతో వీర్యాన్ని నిర్వీర్యం చేసే మార్గాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పరిశోధకులు ఆవిష్కరించారు. ప్రాథమిక పరీక్షల్లో ఈ ఇంజెక్షన్ సత్ఫలితాలు ఇవ్వడంతో మార్కెట్ పరంగా ఉత్పత్తి చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీఐ) అనుమతి కోరుతున్నారు. 

ఈ ఇంజెక్షన్‌కు రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్(ఆర్ఐఎస్యూజీ)గా నామకరణం చేశారు. స్టైరీన్ మెలియాక్ ఆన్ హైడ్రైడ్ పదార్థం అందులో ఉంటుంది. ఇంజెక్షన్‌ను వృషణాల కింది భాగంలో వీర్యవాహికపై వేస్తే సుమారు  13 ఏళ్ల పాటు సంతానాన్ని అడ్డుకోవచ్చు. దీని సక్సెస్ రేటు 97.3 శాతంగా నమోదైంది. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తవని పరిశోధకులు తెలిపారు.