బోరిస్ పర్యటన.. బ్రిటన్ ఎంపీకి ఘాటు రిప్లై ఇచ్చిన భారత్ - MicTv.in - Telugu News
mictv telugu

బోరిస్ పర్యటన.. బ్రిటన్ ఎంపీకి ఘాటు రిప్లై ఇచ్చిన భారత్

April 22, 2022

 30

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం భారత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పాక్ సంతతికి చెందిన బ్రిటన్ మహిళా ఎంపీ నాజ్ షా ఒక ట్వీట్ చేశారు. మోదీతో చర్చించేటప్పుడు వ్యాపార, వాణిజ్య, అంతర్జాతీయ అంశాలతో పాటు భారత్‌లోని ఇస్లామోఫోబియా, కశ్మీర్‌లో దాడుల గురించి కూడా చర్చించాలని బోరిస్ జాన్సన్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై భారత మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా బదులిచ్చారు. ‘భారతదేశంలో ముస్లింలతో పాటు పౌరులంగా సురక్షితంగా ఉన్నారు. మీకున్న ఇండియా ఫోబియాను ఇస్లామోఫోబియాగా ఊహించుకోకండి. వసుధైక కుటుంబమే మా విధానం’ అని బదులిచ్చారు. ఇదిలా ఉండగా, బోరిస్ జాన్సన్ భారత కరోనా టీకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత వ్యాక్సిన్ వేయించుకున్నానని, ప్రపంచానికి భారతదేశం ఫార్మా కేంద్రంగా తయారైందని ప్రశంసించారు.