India has overtaken Britain to become the fifth economic power
mictv telugu

బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ఐదో ఆర్ధిక శక్తిగా అవతరించిన భారత్

September 3, 2022

India has overtaken Britain to become the fifth economic power

యువ జనాభా ఎక్కువగా ఉన్న భారత్ అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో కొత్తదనంతో దూసుకెళ్తోంది. అలాగే ఆర్ధిక రంగంలో కూడా కొత్త రికార్డులను సాధిస్తోంది. బ్లూమ్ బర్గ్ అంచనా ప్రకారం భారత్.. బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే ఐదో ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది. 2021 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే భారత్ ఈ ఘనత సాధించిందని వెల్లడించింది.

అప్పటికి భారత ఆర్ధిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు అయితే బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ 816 బిలియన్ డాలర్లు మాత్రమేనని గణాంకాలతో ప్రకటించింది. అటు కరెన్సీ విలువ పతనంలో బ్రిటన్ కరెన్సీ పౌండ్ భారత రూపాయితో పోలిస్తే 8 శాతం క్షీణించిందని తెలిపింది. తాజా ఘనతతో భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మాత్రమే ముందున్నాయి. సరిగ్గా దశాబ్దం క్రితం భారత్ 11వ స్థానంలో ఉండగా, పదేళ్లలోనే ఆరు స్థానాలు ఎగబాకడం గమనార్హం. దీనిపట్ల కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేస్తూ.. రాబోయే దశాబ్దకాలంలో భారత్ అభివ‌ృద్ధి చెందిన దేశంగా మారడమే కాక, అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.