Home > క్రికెట్ > ఆసియా కప్ ఫైనల్‌కు భారత్ చేరాలంటే..ఈ మ్యాచ్‌లు గెలవాల్సిందే..

ఆసియా కప్ ఫైనల్‌కు భారత్ చేరాలంటే..ఈ మ్యాచ్‌లు గెలవాల్సిందే..

గతకొన్ని రోజులుగా దుబాయ్‌ వేదికగా ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ల్లో టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్ జట్లు తొలి దశను పూర్తి చేసుకొని, సూపర్-4కి అర్హత సాధించాయి. ఈ క్రమంలో గతరాత్రి భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో భారత జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయినప్పటికి ఇప్పటికీ భారత జట్టు ఆసియాకప్ ఫైనల్స్‌కి చేరే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.

భారత జట్టు.. ఈ నెల 6న శ్రీలంకతో, 8న ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్ నెగ్గితే, అప్పుడు ఆప్ఘనిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకను పాకిస్థాన్ ఓడించగలిగితే..అప్పుడు శ్రీలంక ఇంటికి వెళ్లిపోతుంది. ఒకవేళ శ్రీలంక మిగిలిన రెండింటిలో నెగ్గితే, అప్పుడు నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. కాబట్టి భారత్.. శ్రీలంక, అప్ఘానిస్థాన్‌లపై మంచి మార్జిన్‌తో విజయం సాధిస్తే, అప్పుడు ఫైనల్స్ కు చేరుకుంటుంది.

ఇక, ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లోని నెట్ రన్ రేటు విషయానికొస్తే.. పాకిస్థాన్ 0.126 ప్లస్‌గా ఉంది. శ్రీలంక 0.589 ప్లస్‌గా ఉంది, భారత్ 0.126 మైనస్‌గా ఉంది. కావున భారత్ మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారత్, పాక్ జట్ల బలబలాలను పరిశీలిస్తే, గనుక భారత్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే, ఫైనల్స్‌లో మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్లే తలపడే అవకాశం ఉంది. దీనిపై పాక్ క్రికెటర్ రిజ్వాన్ స్పందిస్తూ.."ఇది మూడు మ్యాచుల పాక్-భారత్ సిరీస్ అవుతుంది" అని సరదాగా వ్యాఖ్యానించాడు.

Updated : 5 Sep 2022 1:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top