మలేసియా మతపిచ్చి! భారత హకీ కెప్టెన్ పెళ్లిపై అక్కసు - MicTv.in - Telugu News
mictv telugu

మలేసియా మతపిచ్చి! భారత హకీ కెప్టెన్ పెళ్లిపై అక్కసు

December 22, 2020

ng cvcf

మనుషులు ఒకపక్క గ్రహాలపై కాలుమోపుతున్నారు. మరోపక్క వేల సంవత్సరాలు వెనక్కి నడిచిపోతున్నారు. భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ పెళ్లి దుమారం రేపుతోంది. అతడు మలేసియాకు చెందిన తన ప్రియురాలు ఇలి నజ్వా సిద్ధిఖీని పెళ్లిచేసుకోవడమే దీనికి కారణం. నజ్వా ముస్లిం కావడంతో మలేసియా ప్రభుత్వం నిప్పులు తొక్కిన కోతిలా మండిపడుతోంది. 

ఆమె మతం మారకుండా పెళ్లి చేసుకుందని, దీనికి తగిన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇస్లాం నిబంధనలు నిక్కచ్చిగా పాటించే మలేసియా చూడముచ్చటైన ఈ కొత్తజంట పాలిట విలన్‌గా మారిపోయింది. 

మన్ ప్రీత్ సింగ్ ఇటీవల పంజాబ్‌లోని జలంధర్‌లో నజ్వాను పంజాబీ సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫొటోలు వైరల్ కావడంలో మలేసియా ముస్లిం ఛాందసవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ముస్లింలా పుట్టిన నజ్వా తన మతాన్ని కించపరచింది. ఆమె మతం మారితే మాకేం అభ్యంతరం లేదు. మతం మారకుండా ఇలా పెళ్లి చేసుకోవడం సరికాదు. మలేసియా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ’ అని డిమాండ్ చేస్తున్నారు. 

దీంతో మలేసియా ఉప ప్రధాని పదవితోపాటు మత వ్యవహారాలను పర్యవేక్షించే అహ్మద్ మర్జుక్ స్పందించారు. ‘నజ్వా పెళ్లి గురించి మాకు తెలీదు. ఆమె మలేసియాకు వచ్చాక జవాబు చెప్పి తీరాల్సిందే. మలేసియా ప్రజలు విదేశీయులను పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవాలి. ముస్లిం అయిన నజ్వా వేరే మతస్తుణ్ని పెళ్లి చేసుకోవడం తప్పు..’ అని అన్నారు. అయితే భారతీయులతోపాటు దేశదేశాల క్రీడాభిమానులు మన్ ప్రీత్, నజ్వాలకు అండగా నిలబడుతూ మలేసియా అధికారులును తప్పుబడుతున్నారు.